షాద్నగర్లో రోడ్డు ప్రమాదం.. పలువురు ఉద్యోగులకు గాయాలు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలాజీ టౌన్షిప్ సమీపంలో ఎంఎస్ఎన్ కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.
Accident


రంగారెడ్డి, 27 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలాజీ టౌన్షిప్ సమీపంలో ఎంఎస్ఎన్ కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ఉద్యోగులు గాయపడ్డారు.

ఉద్యోగులు విధులకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారిని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని షాద్నగర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బాధితులకు సహాయం చేయడంతో క్షతగాత్రులను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లగలిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande