చిప్పగిరిలో టీడీపీ నాయకుల ఆందోళన.. ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జయరాం
కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ టీడీపీ నాయకులు, మహిళలు ఆందోళనకు దిగారు.
చిప్పగిరిలో టీడీపీ నాయకుల ఆందోళన.. ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జయరాం


కర్నూలు జిల్లా, 27 నవంబర్ (హి.స.)కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ టీడీపీ నాయకులు, మహిళలు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఇటీవల చిప్పగిరి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రజిని ఆధ్వర్యంలో మహిళలు రాస్తారోకో నిర్వహించారు.

ఎన్నికల అనంతరం రజినీని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర ప్రచారం సాగించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక చిప్పగిరికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బంధువుల ప్రమేయం ఉందని నిరసనకారులు ఆరోపించారు.

రజినీకి మద్దతుగా టీడీపీ నాయకులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా ధర్నాలో పాల్గొని ఆందోళనకు మద్దతు ప్రకటించారు. మరోవైపు, ఈ ఘటనపై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పోలీసుల విచారణలో ఈ ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande