
హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు అప్పుడప్పుడు వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించనున్నాయి.
ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపింది.
రెండు రోజుల పాటు వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులను ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోవడం మంచిది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్