
తిరుమల, 27 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లు, దర్శన టోకెన్ల విడుదల షెడ్యూల్ను టీటీడీ ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా వివిధ దర్శన టికెట్ల జారీ తేదీలను వెల్లడించింది. ఈ నెల 28న శ్రీవాణి దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అలాగే ఈ నెల 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది.
డిసెంబర్ 20, 21 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం అవసరమైన ఎస్ఎస్డీ టోకెన్లను కూడా ఈ నెల 30నే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. వీటితో పాటు సర్వదర్శనం టోకెన్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.
వైకుంఠ ద్వార దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భక్తులు టికెట్ల విడుదల తేదీలు, సమయాలను గమనించి అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు పొందాలని సూచించింది. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్