
సూర్యాపేట, 03 నవంబర్ (హి.స.)
సూర్యాపేట పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్, మెప్మా అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న నల్లబోతు యాదగిరిరావుకు సంబంధించిన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలోని సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ఆయన స్వగృహంతో పాటు గాంధీనగర్లోని బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
ఈ క్రమంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర కీలక ఆధారాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న వివరాలు, ఆస్తుల విలువకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు