
హైదరాబాద్, 03 నవంబర్ (హి.స.)
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, వారికి ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు.
బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను కలెక్టర్ హైమావతి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
పాఠశాల ఆవరణలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, భోజనం నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..