ఆలయ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనుల పురోగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Mla


వరంగల్, 03 నవంబర్ (హి.స.) వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనుల పురోగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎస్డీఎఫ్ (SDF) నిధుల కింద రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు చేపట్టారు.ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణము పూర్తి చేయాలి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పనులన్నింటిపై ఎమ్మెల్యే కలెక్టర్తో ప్రత్యేకంగా చర్చించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande