
అదిలాబాద్, 03 నవంబర్ (హి.స.) ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.
రానున్న దీపావళి పండుగను పురస్కరించుకొని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఆదివాసీ మహిళలు మంగళవారం సందడి చేశారు.
తలమడుగు మండల పరిధిలోని సోనాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన గిరిజన మహిళలు మంగళవారం ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ గిరిజన నృత్యాలతో అలరించి పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి ఆటపాటలు, నృత్యాలతో ఎమ్మెల్యే నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆదివాసీ సమాజంలో గుస్సాడి వేడుకలకు ఎంతో విశిష్టత ఉందన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు గుస్సాడి నృత్యం ప్రతిబింబమని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆచారాలు, కళారూపాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు