
మంచిర్యాల, 03 నవంబర్ (హి.స.)
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మంచిర్యాల డిసిపి భాస్కర్ హెచ్చరించారు. సోమవారం అర్ధరాత్రి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షిర్కే కాలనీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
శ్రీరాంపూర్ CI అశోక్, నస్పూర్ SI తహసీనుద్దీన్ ఆయన వెంట ఉన్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు. అదే సమయంలో అర్ధరాత్రి వాహనాలపై తిరుగుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకులను పట్టుకుని విచారించారు.
అనంతరం వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన DCP, రాత్రి వేళల్లో రోడ్లపై అనవసరంగా తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని, నేర తీవ్రతను బట్టి కొత్తగా రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల కోసం పోలీసుల నిఘా ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు