జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాల ను ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.
Collector


నిజామాబాద్, 03 నవంబర్ (హి.స.)

గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాల ను ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.

జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలో నిర్మాణం చేపడుతున్న జవహర్ నవోదయ విద్యాలయ నూతన క్యాంపస్ పనులను జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. అక్కడ కల్పించనున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు పూర్తయిన పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతం చేయాలని సూచించారు.

విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

నిర్మాణానికి సంబంధించి ఏవైనా అనుమతుల సమస్యలు లేదా ఇతర అడ్డంకులు ఉన్నాయా అని ఆరా తీయగా, అటవీ శాఖ సహా సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులన్నీ పొందామని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు కలెక్టర్కు వివరించారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నందున, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande