
నిజామాబాద్, 03 నవంబర్ (హి.స.)
మాధవ్నగర్ నాలుగు వరుసల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి మంజూరు కావలసిన అదనపు నిధులకు మార్గం సుగమం కావడంతో నిజామాబాద్ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేందుకు అడుగు పడింది.
ప్రాజెక్టు వ్యయాన్ని గతంలో ఉన్న రూ. 93.12 కోట్ల నుంచి రూ. 101.80 కోట్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సవరించిన పరిపాలనా అనుమతులను విడుదల చేస్తూ జీఓ ఆర్టీ నంబర్ 568 జారీ చేసింది.
డిచ్పల్లి – నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య గల లెవల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద ఈ వంతెన నిర్మించాల్సి ఉండగా, అదనపు నిధుల ఆమోదం రెండేళ్లుగా పెండింగ్లో ఉండటం వల్ల పనుల్లో ఆలస్యం జరిగింది.
ఈ సమస్యపై ఎంపీ ధర్మపురి అర్వింద్ పలుమార్లు ప్రభుత్వం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి విజ్ఞప్తులు, నిరసనలు చేపట్టడంతో చివరకు నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..