రైతులు మోసపోవద్దు.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది.
Mla


హైదరాబాద్, 03 నవంబర్ (హి.స.)

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం ఉదయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులు తమ పంటను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే రైతులకు అందాల్సిన బోనస్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande