ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు 58.55 శాతం ఓటింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్రంలో మొత్తం 58.55 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
NOMINATION


అమరావతి , 05 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్రంలో మొత్తం 58.55 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలవారీగా పోలింగ్ శాతాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరాగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది.

విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 71.23 శాతం పోలింగ్ నమోదైంది. కృష్ణా జిల్లాలో 63.04 శాతం, గుంటూరులో 62.9 శాతం, కర్నూలులో 62.34 శాతం, విజయనగరంలో 60.67 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 59.16 శాతం, నెల్లూరులో 57.70 శాతం, పల్నాడులో 58.20 శాతం పోలింగ్ జరిగింది.

ఇక అన్నమయ్య జిల్లాలో 56.81 శాతం, మన్యం జిల్లాలో 56.18 శాతం, కాకినాడలో 55.38 శాతం, ప్రకాశంలో 53.48 శాతం ఓటింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 45.17 శాతం పోలింగ్ జరిగింది. కడప జిల్లాలో 36.35 శాతం, ఏలూరు జిల్లాలో అత్యల్పంగా 26.36 శాతం ఓటింగ్ నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande