
హైదరాబాద్ , 06 నవంబర్ (హి.స.)
తెలంగాణలోని రెండు ప్రధాన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో గత కొద్దివారాలుగా సాగుతున్న నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ ఇవాళ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం తుది గడువు సమాచారాన్ని వెల్లడించింది.
రాష్ట్రంలోని హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్నగర్ మరియు నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పెద్ద ఎత్తున పట్టభద్రులు ఆన్లైన్ (Form 18) ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు లక్షలాది మంది దరఖాస్తు చేయగా, అధికారులు వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
తొలగింపులు, డూప్లికేషన్లు లేకుండా పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయడానికి శ్రమిస్తున్నారు. త్వరలోనే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, ఆపై అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్