భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలంగాణ ఆహార, ఔషధ నాణ్యతా ప్రమాణాల సంస్థ (TG SAFE)కు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.
Photo safety


భద్రాద్రి కొత్తగూడెం, 06 నవంబర్ (హి.స.)

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలంగాణ ఆహార, ఔషధ నాణ్యతా ప్రమాణాల సంస్థ (TG SAFE)కు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం వారు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కిచెన్లలో పరిశుభ్రత పూర్తిగా లోపించినట్లు గుర్తించారు. కొన్ని హోటళ్ల వంట గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తున్నట్లు బయటపడింది. ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానంలోనూ నిర్లక్ష్యం కనిపించింది. తయారీ తేదీలు (Manufacturing Dates) లేని ఆహార పదార్థాలు కూడా అధికారుల దృష్టికి వచ్చాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి Food Safety Rules ఉల్లంఘిస్తున్న తీరుపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన కొన్ని హోటళ్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని హోటళ్ల యాజమాన్యాలకు షో కాజు నోటీసులు అందజేశారు. ఆహార తయారీలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

తదుపరి వార్త పంపండి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande