
హైదరాబాద్ , 06 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. నవంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్న ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఇవాళ విడుదల చేసింది.
ఈ పర్యటనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో రూ. వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా పథకాలు, రోడ్ల విస్తరణ పనులు, పాఠశాలల ఆధునీకరణ పనులను పరిశీలించనున్నారు.
పర్యటన చివరి రోజైన నవంబర్ 9న కొడంగల్లో భారీ బహిరంగ సభ (రైతు సభ) నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. రైతుల రుణమాఫీ, ఉపాధి అవకాశాలు మరియు ప్రాంతీయ అభివృద్ధిపై ఈ సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉనందున స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మరియు ప్రజల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్