పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి..... యాదాద్రి జిల్లా ఎస్పీ
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ గురువారం మోటకొండూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు.
Sp


యాదాద్రి భువనగిరి, 05 నవంబర్ (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ గురువారం మోటకొండూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు.

స్టేషన్కు చేరుకున్న ఆయన ముందుగా రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ, వారి విధులు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలను అదుపు చేయాలని సూచించారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande