
ఆసిఫాబాద్, 06 నవంబర్ (హి.స.)
డ్రగ్స్ రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ కోరారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.
నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ సహకారంతో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో గంజాయి వినియోగదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడారు.
గంజాయి వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. వ్యసనానికి బానిసైన వారిని నేరస్థులుగా చూడటం లేదని, వారిలో మార్పు తీసుకువచ్చి సాధారణ జీవనంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతాన్ని పాఠంగా తీసుకుని భవిష్యత్తును సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని వినియోగదారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..