కరీంనగర్ పాదయాత్రకు రానున్న నితిన్ నబిన్
ఈ నెల 5వ తేదీన కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో పర్యటన సాధ్యపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు.
Bjp


కరీంనగర్ , 06 నవంబర్ (హి.స.)

ఈ నెల 5వ తేదీన కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో పర్యటన సాధ్యపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు.

కరీంనగర్లోని బీజేపీ శ్రేణుల ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఉందని అన్నారు. ఛఠ్ పూజ అనంతరం తప్పకుండా కరీంనగర్కు వచ్చి మహా పాదయాత్రలో తాను స్వయంగా పాల్గొంటానని స్పష్టం చేశారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో నితిన్ నబిన్ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు.

ఈ భేటీలో తెలంగాణలో పార్టీ పరిస్థితి, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ, ఎస్ఐఆర్ విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు కరీంనగర్లో చేపడుతున్న మహా పాదయాత్ర గురించి బండి సంజయ్ నితిన్ నబిన్కు వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande