చీరాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Vote


బాపట్ల , 06 నవంబర్ (హి.స.)

బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా గతంలో జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో తాజాగా లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేడు చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయనే అంశంపై ఆయా పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత చీరాల మున్సిపాలిటీలో ఏ పార్టీ ఆధిపత్యం సాధించనుందనేది తేలనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande