బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
బోటు మునిగి తమిళనాడుకు చెందిన జాలర్లు ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Chandrababu


అమరావతి , 06 నవంబర్ (హి.స.)

బోటు మునిగి తమిళనాడుకు చెందిన జాలర్లు ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొంటూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు జాలర్ల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. గల్లంతైన వారి జాడను వీలైనంత త్వరగా గుర్తించేందుకు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన సిబ్బంది, సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గాలింపు చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. గల్లంతైన జాలర్లను సురక్షితంగా గుర్తించేందుకు అన్ని విధాలా ప్రయత్నించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande