తుపాను నష్టాల పరిశీలనకు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన మురసు తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు.
Chandrababu


అమరావతి , 06 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన మురసు తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు బాధిత ప్రజలు, రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా బాపట్ల జిల్లాలోని జిల్లెలమూడి వంతెన వద్దకు సీఎం వెళ్లనున్నారు. తుపాను ప్రభావంతో వంతెన పరిసరాల్లో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ముఖ్యంగా దెబ్బతిన్న డ్రెయిన్ల పరిస్థితిపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. నీటిపారుదల వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సమీక్షించి, మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలపై నీటిపారుదల శాఖ అధికారులకు సూచనలు చేయనున్నారు.

అనంతరం గుంటూరు జిల్లాలోని రేటూరు గ్రామంలో రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టం, వ్యవసాయ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిహారం తదితర అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని బాధితులకు అవసరమైన సహాయం అందించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande