పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలి.. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
బాధితులకు న్యాయం జరిగేలా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, నేరాల నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు సిబ్బందికి సూచించారు.
Sp


భూపాలపల్లి, 06 నవంబర్ (హి.స.)

బాధితులకు న్యాయం జరిగేలా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, నేరాల నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు సిబ్బందికి సూచించారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్, చిట్యాల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఈ తనిఖీలో స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను నిశితంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande