
ఆదిలాబాద్, 06 నవంబర్ (హి.స.)
క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, క్రీడల అభివృద్ధికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ భరోసా ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో గల హాకీ గ్రౌండ్ గుంతలమయంగా మారి క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. గతంలో క్రీడా పాఠశాలను సందర్శించిన సందర్భంలో మైదానాన్ని బాగుచేసి అందంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శుక్రవారం మరమ్మతు పనులను ప్రారంభించారు.
ట్రాక్టర్ సాయంతో మైదానంలో ఏర్పడిన గుంతలను పూడ్చి, నేలను చదును చేసే పనులను ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. క్రీడాకారులకు మెరుగైన ఆట స్థలాన్ని అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు. అనంతరం క్రీడాకారులతో కలిసి మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలు, అవసరాలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..