తుఫాన్ నష్టంపై మంత్రి తుమ్మల క్షేత్రస్థాయి పర్యటన
తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Minister


ఖమ్మం, 06 నవంబర్ (హి.స.)

తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.

దమ్మపేట మండలంలో ద్విచక్ర వాహనంపై గ్రామగ్రామానా తిరుగుతూ, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, నీట మునిగిన వరి పంటలను స్వయంగా పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలో రహదారులు దెబ్బతినడంతో పాటు, వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనుండగా, మంత్రి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సామాన్యుడిలా బైక్పై తిరుగుతూ రైతులను పలకరించి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande