
నిర్మల్, 06 నవంబర్ (హి.స.)
మార్కెట్లో ధాన్యం ధరలు తగ్గిన సమయంలోనూ రైతులకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.
ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర ప్రకటించిందని, అంతేకాకుండా సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు ముధోల్ మండలంలోని గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు