
ఆదిలాబాద్ జిల్లా, 06 నవంబర్ (హి.స.)
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలు మరియు గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ఇవాళ విస్తృత స్థాయిలో 'స్పెషల్ డ్రైవ్' నిర్వహించింది. అనుమానితులపై జరిపిన డ్రగ్ సేకరణ పరీక్షల్లో 57 మందికి గంజాయి సేవించినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశారు. మరోవైపు జిల్లా సరిహద్దుల్లో అటవీ భూముల్లో అక్రమంగా గంజాయి సాగుకు పాల్పడుతున్న 100 మందికి పైగా రైతులపై కఠిన కేసులు బుక్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ సాగుకు పాల్పడ్డ సుమారు 250 ఎకరాలకు సంబంధించిన 'రైతు భరోసా' లబ్ధిని తక్షణమే నిలిపివేయాలని, వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకోవాలని రవాణా, పోలీసు శాఖల అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు లేఖలు పంపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్