కర్రె గుట్టల వైపు ఎవరు వెళ్లొద్దు.. భద్రత దళాల హెచ్చరిక
ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు, చుట్టుపక్కల కొండ ప్రాంతాల వైపు ప్రస్తుతానికి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Police


హైదరాబాద్, 06 నవంబర్ (హి.స.)

ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు, చుట్టుపక్కల కొండ ప్రాంతాల వైపు ప్రస్తుతానికి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అక్కడ ఇంకా ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలు దాగి ఉండే అవకాశం ఉందని, అందుకే ఆ ప్రాంతంలో త్వరలోనే ప్రణాళికాబద్ధంగా డీమైనింగ్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ హెచ్చరికకు కారణం బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ సెర్చ్ ఆపరేషన్. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో బీజాపూర్ జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్, కోబ్రా 204వ బెటాలియన్ సంయుక్తంగా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడపల్లా గ్రామం దగ్గర ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ చుట్టూ ఉన్న అడవిని జల్లెడ పట్టారు.

ఆ క్రమంలో తడపల్లా ఎఫ్ఓబీకి వాయవ్య దిశలో సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు గతంలో రహస్యంగా దాచిన 711 బారెల్ గ్రెనేడ్ లాంచర్ షెల్స్ బయటపడ్డాయి.

ఒకప్పుడు కర్రెగుట్టలు కీలక మావోయిస్టు నేతలకు సేఫ్ హైడౌట్గా ఉండేవి. గత ఏడాది ఏప్రిల్-మే నెలల్లో అక్కడి దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు 21 రోజుల పాటు భారీ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ నిర్వహించగా, కనీసం 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అడవుల్లో దాగి ఉన్న పేలుడు పదార్థాల ముప్పు ఇంకా ఉందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande