వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు.. సిఎస్ సంజయ్ జాజు
సంక్షేమ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
Cs


ఆసిఫాబాద్, 06 నవంబర్ (హి.స.)

సంక్షేమ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో ఉపాధి హామీ పనులు, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో మౌలిక వసతులు, అంగన్వాడీ భవనాల నిర్మాణంపై సమీక్షించారు. ముఖ్యంగా ఉపాధి కోసం కూలీలు వలస వెళ్లకుండా స్థానికంగానే వి.బి.జి. రామ్ జీ పథకం ద్వారా 125 రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆర్డీఓ లోకేశ్వరరావు సంబంధిత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande