శివరాంపల్లిలో అర్ధరాత్రి పోలీసుల లాఠీచార్జ్: బిగ్ డాడీ బార్ మూసివేత, సీజ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని శివరాంపల్లిలో ఉన్న 'బిగ్ డాడీ' బార్ అండ్ రెస్టారెంట్ వద్ద గురువారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
TELANGANA police


హైదరాబాద్ , 06 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని శివరాంపల్లిలో ఉన్న 'బిగ్ డాడీ' బార్ అండ్ రెస్టారెంట్ వద్ద గురువారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 1 గంట దాటినా బార్ను నిర్వహిస్తుండటంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకుని బార్ను మూసివేయాలని ఆదేశించారు. అయితే బార్ యజమానులు మరియు సిబ్బంది పోలీసుల ఆదేశాలను నిరాకరించి, తమకు వ్యాపార వేళలపై మినహాయింపులు ఉన్నాయంటూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

సమయం దాటినా మద్యం సరఫరా చేయడంపై పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గొడవ పెద్దదై బార్ సిబ్బంది స్థానిక పోలీసులపై దాడికి యత్నించే స్థాయికి చేరుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో రాజేంద్రనగర్ పోలీసులు అదనపు బలగాలను రప్పించి బార్ బయట లాఠీచార్జ్ చేశారు. నిర్వాహకులు, హంగామా చేసిన కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ బిగ్ డాడీ బార్ను సీజ్ చేసి, యజమానులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande