
జగిత్యాల, 07 నవంబర్ (హి.స.)
దీపావళి పండుగ సందర్భంగా జగిత్యాలలో బాణసంచా గోదాంలపై పోలీసులు మెరుపు తనిఖీలు చేశారు. డీఎస్పీ పురుషోత్తం రెడ్డి నేతృత్వంలో టౌన్, రూరల్ పోలీసులు కలిసి గోదాంలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో గొల్లపల్లి రోడ్డులో ఉన్న భారత్ ఫైర్ క్రాకర్స్ గోదాంలో ముగ్గురు చిన్న పిల్లలు పని చేస్తున్నట్లు బయటపడింది. దీనిపై డీఎస్పీ గోదాం యజమానిని గట్టిగా మందలించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు కూడా పెట్టినట్లు చెప్పారు.
బాణసంచా దాచడం, అమ్మడం విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ సూచించారు. భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పండుగ సమయంలో ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు