విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్య శిక్షణ అవసరం.. వరంగల్ జిల్లా కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువు నాణ్యత పెంచి, ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా ప్రత్యేకంగా ప్లాన్ చేయాలి
Collector


వరంగల్, 07 నవంబర్ (హి.స.)

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువు నాణ్యత పెంచి, ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా ప్రత్యేకంగా ప్లాన్ చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా కాలేజియేట్ విద్యా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో కళాశాలల ప్రగతి, పరీక్ష ఫలితాలు, హాజరు, మౌలిక సౌకర్యాల గురించి సమీక్షించారు.

విద్యార్థులకు కేవలం మంచి చదువు మాత్రమే కాకుండా నైపుణ్య శిక్షణ, పోటీ పరీక్షలకు మార్గదర్శకత్వం, క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది సక్రమంగా వచ్చేలా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టాలని ఆదేశించారు. సీకేఎం, వర్ధన్నపేట, రంగసాయిపేట, నర్సంపేట కళాశాలలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ల్యాబ్లు, తరగతి గదులు, బాలికల హాస్టళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande