పశువుల సంరక్షణ పై అధికారులతో కలెక్టర్ సమీక్ష
పశువులకు ఎల్నినోతో ఇబ్బంది రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
Collector


మెదక్, 07 నవంబర్ (హి.స.)

పశువులకు ఎల్నినోతో ఇబ్బంది రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పశువుల సంరక్షణ, గడ్డి, తాగునీటి విషయంలో పలు సూచనలు చేశారు.

జిల్లాలో ఉన్న 67 పశువైద్యశాలల ద్వారా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11 వరకు ప్రత్యేక డ్రైవ్ పెట్టి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయనున్నట్లు తెలిపారు.

ఎల్నినో వల్ల వర్షాలు తగ్గి గడ్డి కొరత వచ్చే అవకాశం ఉందని, అందుకే రైతులు ముందుగానే ఎండుగడ్డిని దాచుకుని ఉంచుకోవాలని సూచించారు. పశువులకు రోజుకు 40 నుంచి 60 లీటర్ల మంచి తాగునీరు ఇవ్వాలని, ఎండ నుంచి వాటిని కాపాడాలని చెప్పారు.

అనంతరం పాడి రైతుల కోసం 'భారత్ పశుధన్' యాప్ గురించి వివరించారు. ఈ యాప్లో పశువుల ఆరోగ్యం, సంతానోత్పత్తి, పాల ఉత్పత్తి వంటి వివరాలను డిజిటల్గా నమోదు చేసుకోవచ్చన్నారు. గూగుల్ ప్లే స్టోర్లో ఉచితంగా దొరికే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్, మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande