
మహబూబాబాద్, 07 నవంబర్ (హి.స)
జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వేను త్వరగా పూర్తి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు సూచించారు. ఎక్కడా ఆలస్యం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నిర్ణయించిన గడువులోనే పనులు ముగించాలన్నారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ సర్వేయర్ శ్రీనివాసులుతో కలిసి రీ సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎంత పని అయ్యింది, క్షేత్రంలో ఏ సమస్యలు వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో మొత్తం 23 గ్రామాల్లో రెండు విడతలుగా రీ సర్వే జరుగుతోంది. మొదటి విడతలో మహబూబాబాద్, కురవి, బయ్యారం, గార్ల, డోర్నకల్, నెల్లికుదురు, తొర్రూరు, కేసముద్రం, గూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర మండలాల్లోని 11 గ్రామాల్లో పనులు మొదలుపెట్టారు. రెండో విడతలో మరిపెడ, ఇనుగుర్తి ప్రాంతాలతో సహా 12 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జరిగే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పెట్టుకున్న లక్ష్యాలను సమయానికి చేరుకునేలా చూడాలని ప్రభుత్వ, లైసెన్సు సర్వేయర్లకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు