
పులివెందుల, 07 నవంబర్ (హి.స.)
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారతి విజయకేతనం ఎగురవేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె తన ప్రత్యర్థులపై 1,463 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఎన్నికల అధికారులు భారతిని విజేతగా అధికారికంగా ప్రకటించారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
పులివెందుల నియోజకవర్గంలో ఈ ఫలితం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనప్పటికీ భారతి మెజార్టీ సాధించడం టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది. ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులు విజయోత్సవాలకు సిద్ధమయ్యాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు భారతికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు భారతి కృతజ్ఞతలు తెలియజేశారు. 1,463 ఓట్ల మెజార్టీతో సాధించిన ఈ విజయం పులివెందుల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్