నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Vote


అమరావతి , 07 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. జడ్పీటీసీ స్థానాల్లో 2,169 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది పోటీ పడుతున్నారు.

రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈసారి పరిషత్ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్ నమోదైంది. గత 2021లో జరిగిన పరిషత్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం 9.81 శాతం పెరగడం విశేషం. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందనే అంశంపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande