
సంగారెడ్డి, 07 నవంబర్ (హి.స.)
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వాహనం వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు రహదారిపై బోల్తా పడటంతో అందులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కారు బోల్తా పడిన తీరును పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్