
మంచిర్యాల, 07 నవంబర్ (హి.స.)
మంచిర్యాల జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాజీపూర్ మండలం గుడిపేటలోని పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంక్ ముందు జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒకే బైక్పై ముగ్గురు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. దీపావళి పండగ వేళ జరిగిన ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..