మూడుచింతలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడుచింతలపల్లి పరిధిలోని నాగిశెట్టిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Unidentified dead body


మేడ్చల్, 07 నవంబర్ (హి.స.)

మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడుచింతలపల్లి పరిధిలోని నాగిశెట్టిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రహదారిపై బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు బైక్పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో నాగిశెట్టిపల్లి పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. મૃતుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande