
అమరావతి, 07 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్
రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం మరొక భారీ నిర్ణయం
తీసుకుంది.అమరావతి పరిధిలో
నగిరి అసెంబ్లీ భవనం, సచివాలయ ప్రాంగణాలు, ప్రధాన ట్రంక్ రోడ్లు మరియు డ్రైనేజీ
వ్యవస్థకు సంబంధించిన రూ. 1,548.98 కోట్ల విలువై పనులకు
తుది ఆమోదం తెలుపుతూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది.
గతంలో
మధ్యలోనే నిలిచిపోయిన భవనాల కన్స్ట్రక్షన్ పనులను తిరిగి ప్రారంభించేందుకు కాంట్రాక్టు
ఏజెన్సీలకు ఆదేశాలు పంపారు.నూతన సాంకేతిక
పరిజ్ఞానంతో ఐకానిక్ భవనాలు, విశాలమైన రహదారులు, ఎలక్ట్రిసిటీ డక్ట్‌లు మరియు అండర్‌గ్రౌండ్
డ్రైనేజీ నెట్‌వర్క్ పనులను గడువులోగా పూర్తి చేసేలా కఠినమైన నిబంధనలను విధించారు.వచ్చే రెండేళ్లలో రాజధాని పరిధిలోని
ప్రాథమిక మౌలిక వసతులన్నింటినీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రణాళికను అమలు
చేస్తున్నారు.
అమరావతి
ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపుతో పాటు, ప్లాట్ల అభివృద్ధి పనులను కూడా ఈ
నిధులతో వేగవంతం చేయనున్నారు.అమరావతి నిర్మాణం
పునఃప్రారంభం కావడంతో రాజధాని ప్రాంతంలో మళ్లీ రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార
కార్యకలాపాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi