యుద్ధ ప్రాతిపదికన సేవలు: 1,893 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేసిన ఏపీ ఇంధన శాఖ!
యుద్ధ ప్రాతిపదికన సేవలు: 1,893 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేసిన ఏపీ ఇంధన శాఖ!
electricity


అమరావతి, 07 నవంబర్ (హి.స.)

ఈదురుగాలులు

మరియు భారీ వర్షాల కారణంగా తుపాను ప్రభావిత జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్

వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన బాగు చేసి రికార్డు స్థాయిలో 1,893 గ్రామాలకు శనివారం నాటికి

పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఏపీ ఇంధన శాఖ ప్రకటించింది.నేలకూలిన వేలాది విద్యుత్ స్తంభాలు, తెగిపడిన సబ్‌స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్లను

వేలాది మంది సిబ్బంది అహర్నిశలు శ్రమించి పునరుద్ధరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

విద్యుత్

కనెక్షన్లు పునరుద్ధరణతో పాటు, ప్రాథమిక ఆరోగ్య

కేంద్రాలు మరియు మంచినీటి పంపింగ్ కేంద్రాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా

ప్రాధాన్యత ఇచ్చారు.తాగునీటి కొరత

తలెత్తకుండా చూడటం ద్వారా ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రభుత్వం

ముందస్తు చర్యలు చేపట్టింది.ఇందుకోసం పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ముంపు

గ్రామాల్లో రక్షిత తాగునీటి సరఫరా మరియు క్లోరినేషన్ పనులను వేగవంతం చేశాయి.

ఇంధన

శాఖ చూపిన చొరవను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.తుపానులు వచ్చిన సమయంలో మౌలిక

సదుపాయాలను త్వరితగతిన పునరుద్ధరించడం వల్ల బాధితులకు ఊరట లభించిందని తెలిపారు.ఏరియల్ డ్రోన్ల ద్వారా లైన్లను

పరిశీలించి మిగిలిన కొద్దిపాటి ప్రాంతాల్లో కూడా శనివారం రాత్రికి పూర్తి స్థాయి

విద్యుత్ అందిస్తామని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande