
అమరావతి, 07 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఇటీవలి తీవ్ర తుపానుల కారణంగా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.భూమి
ఉన్న రైతులతో పాటు కౌలు రైతులను కూడా సమానంగా పరిగణించి ఇన్‌పుట్ సబ్సిడీ
(పెట్టుబడి సాయం)ని నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా
పరిహారాన్ని జమ చేసేందుకు శనివారం రెవెన్యూ,
వ్యవసాయ
శాఖలు సంయుక్తంగా కసరత్తు పూర్తి చేశాయి.
దీనితో పాటు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) వ్యవసాయ పనులతో మరియు డ్రైనేజీ పూడికతీత
పనులతో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఉపాధి హామీ పథకంలో రైతుల పంట పొలాల
నుంచి నీటిని తొలగించడం, దెబ్బతిన్న వరద కట్టల
మరమ్మతులు చేయడం వంటి పనులను చేర్చడం ద్వారా ఉపాధి కూలీలకు పని కల్పించడంతో పాటు
రైతులపై అదనపు భారం పడకుండా చూడవచ్చని ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసి
కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతున్నట్లు తెలిపారు.
అలాగే, రాబోయే రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలను
80 శాతం రాయితీపై అందిస్తామని ప్రభుత్వం
వెల్లడించింది.తుపాను వల్ల
విత్తనాలు పోగొట్టుకున్న రైతులు మళ్లీ విత్తనాలు చల్లుకునేలా వ్యవసాయ శాఖ తగిన
ఏర్పాట్లు చేస్తోందని, ఏ ఒక్క రైతు కూడా
నష్టపోకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా జాబితాలను తయారుచేస్తున్నామని అధికారులు
వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi