
అమరావతి, 07 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో
ఇటీవల సంభవించిన 'మురసు' తుపాను వల్ల జరిగిన ఆస్తి, పంట మరియు మౌలిక వసతుల నష్టానికి
సంబంధించి తుది సమీక్షను పూర్తి చేసి నివేదికను శనివారం సమర్పించాల్సిందిగా
ప్రభుత్వం రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖలను ఆదేశించింది.ఇప్పటికే మొదటి విడత 'అర్నబ్' తుపాను
నష్ట పరిహారం అంచనాలను కేంద్రానికి అందజేయగా,
తాజాగా
వచ్చిన రెండవ తుపాను వల్ల దెబ్బతిన్న రోడ్లు,
విద్యుత్
స్తంభాలు, ఇళ్లు మరియు పంటల
వివరాలను ఒకే సమగ్ర నివేదికగా రూపొందిస్తున్నారు.
ఉమ్మడి
జిల్లాల వారీగా కలెక్టర్లు సేకరించిన ప్రాథమిక నివేదికల ప్రకారం...రవాణా, విద్యుత్
సరఫరా, తాగునీటి పథకాలు
తీవ్రంగా దెబ్బతిన్నాయి.వేలాది కిలోమీటర్ల
మేర రహదారులు గోతులు పడగా, అపారమైన పంట నష్టం
వాటిల్లింది.కేంద్ర విపత్తు సహాయ
నిధి (NDRF) నుండి అదనపు నిధులను
సాధించేందుకు వీలుగా నష్ట పరిమాణాన్ని శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసినట్లు
ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర
బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి దెబ్బతిన్న ప్రాంతాలను ప్రత్యక్షంగా
పరిశీలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.కేంద్ర సహాయం అందే వరకు వేచి చూడకుండా, విపత్తు నిర్వహణ నిధుల నుంచి తక్షణ
మరమ్మతులకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi