మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన: దెబ్బతిన్న పంటల పరిశీలన, రైతులకు ధైర్యం!
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన: దెబ్బతిన్న పంటల పరిశీలన, రైతులకు ధైర్యం!
Chandra Babu Naidu


అమరావతి, 07 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో

వరుసగా సంభవించిన అర్నబ్ మరియు మురసు తుపానుల ధాటికి దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యానవన పంటలు, మరియు ఇళ్ల నష్టాన్ని నేరుగా అంచనా

వేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం క్షేత్రస్థాయి పర్యటనలు

చేపట్టారు.బాపట్ల, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని

ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.నీటమునిగిన

పంట పొలాలను, తెగిపోయిన

డ్రెయిన్లను సీఎం పరిశీలించారు.నష్టపోయిన రైతులు

మరియు స్థానికులతో నేరుగా మాట్లాడి వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని

ధైర్యం చెప్పారు.

పర్యటన

సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...తుపాను

వల్ల లక్షలాది ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి మరియు కూరగాయల పంటలు తీవ్రంగా

దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో

ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో వరుస తుపానులు రావడం వల్ల కోత దశకు వచ్చిన పంటలు

నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటకు

పంపడానికి అవసరమైన యంత్రాలను ఉచితంగా సమకూర్చాలని వ్యవసాయ శాఖ అధికారులను

ఆదేశించారు.

పరిపరిస్థితిని

సమీక్షించిన సీఎం, సహాయక చర్యల్లో

ఎలాంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.బాధితులకు తక్షణమే అవసరమైన బియ్యం, కందిపప్పు, వంటనూనె తదితర అత్యవసర నిత్యావసర

సరుకులను పంపిణీ చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.నష్టపోయిన ప్రతి రైతుకూ నిబంధనల ప్రకారం

పూర్తిస్థాయి పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande