
హైదరాబాద్ , 07 నవంబర్ (హి.స.)
తెలంగాణలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ కార్పొరేషన్లు, బోర్డుల నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు వేగవంతం చేశారు. శనివారం అందిన కథనాల ప్రకారం... పార్టీ కోసం తొలినుంచి కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు మరియు వివిధ వర్గాల ప్రతినిధులకు ఈ పదవుల్లో ప్రాధాన్యత కల్పించేలా కసరత్తు పూర్తయింది.
పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపి తొలి విడత జాబితాను త్వరలోనే విడుదల చేయడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలు, పార్లమెంట్ స్థానాల పరిధిలోని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ వార్తతో తీవ్ర ఉత్సాహం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్