హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్: అమల్లోకి వచ్చిన ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ తగ్గించిన ధరలు
హైదరాబాద్ నగరవాసులకు, రోజువారీ ప్రయాణికులకు రవాణా భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం సవరించిన టీజీఎస్ ఆర్టీసీ మరియు మెట్రో ఉమ్మడి పాస్ (కంబైన్డ్ పాస్) కొత్త ధరలు శనివారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.
namma-metro-15-years-longest-routes-busiest-stations-airport-connectivity


హైదరాబాద్ , 07 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ నగరవాసులకు, రోజువారీ ప్రయాణికులకు రవాణా భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం సవరించిన టీజీఎస్ ఆర్టీసీ మరియు మెట్రో ఉమ్మడి పాస్ (కంబైన్డ్ పాస్) కొత్త ధరలు శనివారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. గతంలో అత్యధిక ధర (రూ. 8,500) కారణంగా సాధారణ ప్రజలకు దూరమైన ఈ ఉమ్మడి పాస్ ధరను సగానికి పైగా తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సవరించిన ధరల ప్రకారం, ప్రస్తుతం నెలవారీ కంబైన్డ్ పాస్ రూ. 4,000కే అందుబాటులోకి వచ్చింది. ఈ రూ. 4,000లో రూ. 3,000 మెట్రో రైలు ప్రయాణానికి, రూ. 1,000 ఆర్టీసీ బస్సు సేవలకు కేటాయించబడుతుంది. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు నెలలో 50 రౌండ్ ట్రిప్పులు మెట్రోలో ప్రయాణించవచ్చు. అదేవిధంగా రోజువారీ ఉమ్మడి పాస్ ధరను కూడా రూ. 400 నుంచి రూ. 275కు తగ్గించారు.

శనివారం ఉదయం నుంచే నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లు మరియు ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లలో ఈ పాస్ల విక్రయం ప్రారంభమైంది. ఈ నిర్ణయం వల్ల నిత్యం మెట్రో, బస్సుల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మరియు సామాన్య వ్యాపారులకు నెలకు వేలాది రూపాయలు ఆదా కానున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande