జలవనరుల ప్రాజెక్టుల పునర్నిర్మాణంపై రూ. 35,000 కోట్లతో ప్రణాళికలు
జలవనరుల ప్రాజెక్టుల పునర్నిర్మాణంపై రూ. 35,000 కోట్లతో ప్రణాళికలు
ap


అమరావతి, 07 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా అరకొర నిధులతో

నిలిచిపోయిన ప్రధాన మరియు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి

చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం రూ.

35,000 కోట్లతో

సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.రాష్ట్రంలోని వివిధ

జిల్లాల్లో ఉన్న 36 ప్రాజెక్టులను మొదటి

విడతలో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, నిరుపయోగంగా ఉన్న

లక్షలాది ఎకరాల భూములకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ బృహత్తర ప్రణాళికను

రూపొందించారు.

దీనిలో

భాగంగానే రాయలసీమ, ఉత్తరాంధ్ర మరియు

కోస్తాంధ్ర ప్రాంతాల్లోని డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడానికి నిధులు

కేటాయించనున్నారు.ఇటీవల సంభవించిన

తుపానుల సమయంలో కాలువలు, డ్రెయిన్లు

పొంగిపొర్లి వందలాది గ్రామాలు ముంపునకు గురికావడాన్ని సీరియస్‌గా తీసుకున్న

ప్రభుత్వం, కాలువల వెడల్పు పెంచడం

మరియు వరద గట్లను బలోపేతం చేసే పనులకు శ్రీకారం చుట్టింది.ప్రాజెక్టుల భూసేకరణ లోపాలను వేగంగా

పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో కరువు పీడిత

ప్రాంతాలకు తాగు, సాగునీరు అందడంతో పాటు వరద నష్టాలు గణనీయంగా

తగ్గుతాయని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande