అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రాభవం: ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’ సన్నాహకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 07 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’ సన్నాహకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

సదస్సులో భాగంగా ‘రక్షా ఎక్స్పో’, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, ఇండియా జాయ్ ఎక్స్పోలతో కలిపి 6 ప్రత్యేక ఎగ్జిబిషన్ హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. గ్లోబల్ సమిట్కు హాజరయ్యే ప్రతి అంతర్జాతీయ ప్రతినిధి కోసం ఒక ప్రత్యేక లైజన్ ఆఫీసర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ను కేటాయించాలని సీఎం రేవంత్ సూచించారు. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి సదస్సు ముగిసి తిరిగి వెళ్లే వరకు ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా, బస ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు పంపాలని శనివారం అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande