ప్రభుత్వ ఉద్యోగుల భౌతిక ఎస్ఆర్ల (Physical SR) నిర్వహణ నిలిపివేత
ప్రభుత్వ ఉద్యోగుల భౌతిక ఎస్ఆర్ల (Physical SR) నిర్వహణ నిలిపివేత
ap


అమరావతి, 07 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా వ్యవహారాల్లో పారదర్శకతను పెంచేందుకు ఆర్థిక శాఖ

శనివారం ఒక కీలక ఉత్తర్వును (సర్క్యులర్ మెమో) జారీ చేసింది.ఉద్యోగులకు సంబంధించిన ఈ-సర్వీస్

రికార్డ్ (e-SR) డిజిటలైజేషన్

ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఇకపై ప్రభుత్వ

కార్యాలయాల్లో ఎలాంటి భౌతిక సర్వీసు పుస్తకాలను (Physical Service Registers) నిర్వహించాల్సిన అవసరం లేదని

తేల్చిచెప్పింది.ఇకపై ప్రమోషన్లు, జీతాల పెంపు, లీవ్స్, బదిలీలు

వంటి వివరాలన్నీ కేవలం ఆన్‌లైన్ ఇ-ఎస్ఆర్ ద్వారానే నమోదు కానున్నాయి.

గతంలో

భౌతిక రికార్డులను నిర్వహించడంవల్ల దస్త్రాలు

పోవడమే కాకుండా, పెన్షన్ లేదా

సవరించిన స్కేళ్ల నమోదు సమయంలో ఉద్యోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేవారు.సర్వీస్ పుస్తకాల నమోదులో చోటుచేసుకునే

ఆలస్యాన్ని నివారించడానికి మరియు అవినీతికి చెక్ పెట్టడానికి ఇ-ఎస్ఆర్ విధానం

ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్థిక శాఖ తెలిపింది.డిజిటల్ సంతకాల ద్వారా రికార్డుల

నిర్వహణ అత్యంత వేగంగా, భద్రంగా జరుగుతుందని

అధికారులు వివరించారు.

ఈ

నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు

ఉపాధ్యాయులకు పదవీ విరమణ సమయంలో లభించే బెనిఫిట్లు, పెన్షన్

మంజూరు అత్యంత వేగవంతంగా జరగనుంది.ఇంకా

ఇ-ఎస్ఆర్‌లో సమాచారం పూర్తి చేయని కొద్దిమంది ఉద్యోగులకు త్వరితగతిన డేటా ఎంట్రీ

పూర్తి చేయాలని డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్ ఆఫీసర్లకు (DDO) ప్రభుత్వం చివరి ఆదేశాలు జారీ చేసింది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande