
హైదరాబాద్ , 07 నవంబర్ (హి.స.)
దీపావళి పండుగ అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం’ పేరిట విస్తృత పాదయాత్రలు చేపడతామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నగరపు రాంచందర్ రావు శనివారం వెల్లడించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ పాదయాత్రల్లో పాల్గొనేందుకు జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా రానున్నారని తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు భరోసా, రుణమాఫీ మరియు యువతకు ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడాన్ని తాము స్వాగతిస్తామని, అయితే రైతులను, పేదలను ఇబ్బందులకు గురిచేసే విధానాలను మాత్రం తీవ్రంగా నిరోధిస్తామని శనివారం రాంచందర్ రావు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్